నిర్మల్, జూలై 8
ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ శానిటేషన్, రోగి సంరక్షణ, భద్రతా సిబ్బంది సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ వైద్య కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఇవ్వాలని ఇవ్వాలని కార్మికుల సంఘండిమాండ్ ిమాం్ చేసింది. రూ.26 వేల కనీస వేతనం, 23 రోజుల సెలవులు, ఒక నెల బోనస్ చెల్లించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు.
ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ శానిటేషన్, రోగి సంరక్షణ, భద్రతా సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వైద్య కాంట్రాక్ట్ ఉద్యోగులు, కార్మికుల సంఘం డిమాండ్ చేసింది. కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు సంఘం నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ శానిటేషన్, రోగి సంరక్షణ, భద్రతా సిబ్బందికి నెలకు కనీస వేతనం రూ.26 వేలుగా అమలు చేయాలని కోరారు. అలాగే ఏడాదికి 23 రోజుల వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయడంతో పాటు ఒక నెల వేతనాన్ని బోనస్‌గా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ డిమాండ్ల సాధన కోసం జూలై 7, 8 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల ఎదుట గంటపాటు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా జూలై 9వ తేదీ ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని కోటి కేంద్రంలో భారీ మహాధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
ఈ మహాధర్నాను విజయవంతం చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండి. యూసుఫ్, ప్రధాన కార్యదర్శి ఎం. నరసింహ కార్మికులకు, ప్రజా సంఘాలకు పిలుపునిచ్చారు.











