ముధోల్, జులై 08
వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిల్లల వైద్య నిపుణులు దయానంద్ రెడ్డి సూచించారు. ముథోల్ మండల కేంద్రంలోని రబింద్ర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆయన అవగాహన కల్పించారు. దోమలు, ఈగల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిల్లల వైద్య నిపుణులు దయానంద్ రెడ్డి అన్నారు. బుధవారం ముథోల్ మండల కేంద్రంలోని రబింద్ర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వర్షాకాలంలో ప్రబలే వ్యాధుల నివారణపై అవగాహన కల్పించారు.
వర్షాకాలంలో వచ్చే వ్యాధుల గురించి ఆయన వివరించారు. దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మురికి గుంటలు దోమల పెరుగుదలకు నిలయాలని, వాటిని పరిసరాల్లో లేకుండా చూసుకోవాలని సూచించారు. పూలకుండీలు, కూలర్లలో నీటిని ఎప్పటికప్పుడు మార్చాలని తెలిపారు. దోమల ద్వారా కలిగే డెంగ్యూ చాలా ప్రమాదకరమని, ఇది రక్తపలకికలు తగ్గేలా చేసి, ప్రాణానికే ముప్పు తెస్తుందని హెచ్చరించారు.
వ్యాధులు రాకముందే జాగ్రత్త అవసరమని, భోజనానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, శరీరం అంతా కవర్ అయ్యేలా దుస్తులు ధరించాలని సూచించారు. అలాగే ఈగలు పెరగకుండా అరికట్టాలని, పరిసరాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లాలని తెలిపారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ అసంవార్ సాయినాథ్ మాట్లాడుతూ, బయట లభించే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం డాక్టర్ దయానంద్ రెడ్డిని పాఠశాల యజమాన్యం సన్మానించింది. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రాజేందర్, డైరెక్టర్ పోతన్న యాదవ్, భీమ్ రావు దేశాయ్, ఆర్ఎంపీ డాక్టర్ కృష్ణ, నర్సింగ్, సాయి బాబా, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.












