Palnadu/Amaravathi (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 28
తమ కుమార్తెకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, మరో బిడ్డను పెంచడం ఆర్థికంగా, సామాజికంగా భారమని భావించిన ఒక జంట, కడుపులోని బిడ్డను అబార్షన్ చేయించుకుంది. ఈ అబార్షన్ కోసం వారు ఏకంగా RMP డాక్టర్‌కు రూ.50,000 చెల్లించారు. కడుపులో ఉన్నది ఆడపిల్లో, మగపిల్లో అని తెలుసుకోవడానికి రూ.20,000, అబార్షన్ చేయడానికి రూ.30,000 ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ ఘటన పాలనాడు జిల్లాలో చోటుచేసుకున్నట్లు సమాచారం. ఆడపిల్లలంటే సమాజంలో వివక్ష, వారిని పెంచడంలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, మరిన్ని ఆడపిల్లలను కని పెంచడం కష్టమని భావించిన తల్లిదండ్రులు ఈ నిర్ణయం తీసుకున్నారని బాధితురాలి తల్లి శ్రావణి పేర్కొన్నారు. RMP డాక్టర్ల నిర్లక్ష్యం, చట్టవిరుద్ధమైన పద్ధతులకు పాల్పడటంపై ఈ సంఘటన ద్వారా మరోసారి వెలుగులోకి వచ్చింది. ఇలాంటి అబార్షన్లు చట్టవిరుద్ధమని, అవి ఆరోగ్యానికి కూడా హానికరం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.