భైంసా, జూన్ 28
ప్రమాదంలో గాయపడిన బాసర మండలం ఓని గ్రామానికి చెందిన ప్రసాద్‌ను ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్ రావు పాటిల్ పరామర్శించారు. భైంసాలోని జీడీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రసాద్‌ను కలిసి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ప్రమాదవశాత్తు గాయపడిన బాధితుడిని ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్ రావు పాటిల్ పరామర్శించారు. భైంసా పట్టణంలోని జీడీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాసర మండలం ఓని గ్రామానికి చెందిన ప్రసాద్‌ను ఆయన కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
జరిగిన సంఘటన వివరాలను బాధితుడు, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్న చైర్మన్ మోహన్ రావు పాటిల్, ప్రసాద్‌కు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అలాగే ప్రసాద్ కుటుంబ సభ్యులు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ధైర్యంగా ఉండాలని మనోధైర్యం కల్పించారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ట్రస్ట్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.












