మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 21
రాష్ట్ర ప్రభుత్వం నర్సులకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కీలక చర్యలు చేపట్టింది. TOMCOM-గ్లోబల్ నర్స్ ఫోర్స్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ద్వారా జపాన్, జర్మనీ, ఇజ్రాయెల్ వంటి దేశాల్లో ఉద్యోగాలకు అర్హులైన నర్సులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ప్రత్యేక శిక్షణ అందించనున్నారు.
నర్సులకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. TOMCOM-గ్లోబల్ నర్స్ ఫోర్స్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. దీని ద్వారా జపాన్, జర్మనీ, ఇజ్రాయెల్ సహా పలు దేశాల్లో ఉద్యోగాల కోసం అర్హులైన నర్సులకు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి వివేక్ తెలిపారు. ఈ శిక్షణలో విదేశీ భాషలు, క్లినికల్ కమ్యూనికేషన్, వీసా, లైసెన్సింగ్, ప్లేస్మెంట్స్ వంటి అంశాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.












