మిర్యాలగూడ, జూలై 1
జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా మిర్యాలగూడలో వాకర్స్ అసోసియేషన్, జనయేత్రి ఫౌండేషన్ సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించాయి. రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ కామిశెట్టి సత్యనారాయణ ఆర్థిక సహాయంతో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ వైద్యులు ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించారు.
జాతీయ వైద్యుల దినోత్సవం (డాక్టర్స్ డే) సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వాకర్స్ అసోసియేషన్, జనయేత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మునీర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ కామిశెట్టి సత్యనారాయణ ఆర్థిక సహాయంతో ఈ శిబిరం జరిగింది.
వైద్య శిబిరంలో ప్రముఖ వైద్యులు డాక్టర్లు జాడి రాజు, నాగేశ్వరరావు, బాలాజీ, విశాల్, నాగు నాయక్, మోయిద్, ఝాన్సీ లక్ష్మీబాయి, అక్షిత, శ్వేతారెడ్డి, మణికంఠ, రాంబాబు హాజరై ప్రజలకు ఉచిత వైద్యసేవలు అందించారు. మిర్యాలగూడ ఐఎంఏ, ప్రముఖ వైద్యులు డాక్టర్ మువ్వ రామారావు, డాక్టర్లు అంజయ్య, అశ్విన్ కుమార్, కృష్ణ ప్రసాద్, జానకి రాములు కూడా పాల్గొన్నారు.
ముఖ్య అతిథులుగా హాజరైన 17వ వార్డు కౌన్సిలర్ నూకల కవిత వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో జనయేత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మునీర్ షరీఫ్, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కన్నబోయిన వెంకటేశ్వర్లు యాదవ్, ప్రధాన కార్యదర్శి కొర్ర కృష్ణకాంత్ నాయక్, ఉపాధ్యక్షులు జానకిరామ్ రెడ్డి, వెంకటరత్నం, కోశాధికారి చిన్న వెంకన్న, సంయుక్త కార్యదర్శులు పులి శ్రీనివాస్ గౌడ్, నామ రత్నకుమార్, డైరెక్టర్లు కాసుల సత్యం, మహేష్ రెడ్డి, సక్రం నాయక్, వంకాయల శ్రీనివాస్, పొదిల శ్రీనివాస్, రాధి రాజేశ్వరి, అశోక్ చారి, నాగరాజు, సైదులు, వీరేందర్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.











