భైంసా, జులై 01
జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా భైంసా ప్రభుత్వ వైద్యశాలలో పేద ప్రజలకు అంకితభావంతో సేవలందిస్తున్న నర్సింగ్ అధికారిణి బర్ల సంపూర్ణ మాదిగను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్) నిర్మల్ జిల్లా శాఖ అభినందించింది. సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న మహిళా వైద్య సిబ్బంది సేవలు వెలకట్టలేనివని తెలిపారు.
జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్) తరఫున శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా భైంసా ప్రభుత్వ వైద్యశాలలో పేద ప్రజలకు అంకితభావంతో సేవలందిస్తున్న నర్సింగ్ అధికారిణి బర్ల సంపూర్ణ మాదిగను ఎంఆర్పీఎస్ నిర్మల్ జిల్లా శాఖ అభినందించింది.
చీరకట్టుతో, చేతిలో కలంతో, మెడలో స్టెతస్కోప్‌తో సేవలందిస్తున్న ప్రతి మహిళా వైద్య సిబ్బంది సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు. పేదల ఆరోగ్యంపై భరోసా కల్పిస్తూ, తమ సేవలతో ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని కొనియాడారు.
చదువుతో పాటు సామాజిక బాధ్యతను కూడా స్వీకరించి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న బర్ల సంపూర్ణ మాదిగ అంకితభావం అభినందనీయమని తెలిపారు.
చదువుకున్న మాదిగ బిడ్డలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు సంపూర్ణ మాదిగ నిదర్శనంగా నిలుస్తున్నారని ఎంఆర్పీఎస్ నిర్మల్ జిల్లా అధికార ప్రతినిధి కల్లెడ సాయి మాదిగ పేర్కొన్నారు.
ప్రజల ఆరోగ్య సేవలో భాగస్వాములవుతున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బంది సేవలు వెలకట్టలేనివని, వారికి ఎల్లప్పుడూ గౌరవం ఉంటుందని తెలిపారు.












