లోకేశ్వరం, జూన్ 28
లోకేశ్వరం మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 0 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు సూచించారు. ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు కొనసాగుతుంది.
లోకేశ్వరం మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. 0 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు సూచించారు.
పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు సమీపంలోని పోలియో కేంద్రాల్లో చుక్కలు వేయించాలని కోరారు. పల్స్ పోలియో కార్యక్రమం మూడు రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ ధార్వాడి కపిల్, ఉప సర్పంచ్, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.












