ఆసుపత్రి) (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 01
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ కేంద్రం (ఎం.సీ.హెచ్ ఆసుపత్రి)ను జిల్లా కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ కేంద్రం (ఎం.సీ.హెచ్ ఆసుపత్రి)ను జిల్లా కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
తనిఖీలో భాగంగా కలెక్టర్ ఆసుపత్రిలోని పలు విభాగాలను సందర్శించారు. ముందుగా ఓపీ విభాగాన్ని పరిశీలించి, ప్రతిరోజు వచ్చే రోగుల సంఖ్య, టోకెన్ విధానం, వైద్యుల అందుబాటు వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోగులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా త్వరితగతిన వైద్య సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు.
అనంతరం స్కానింగ్ సెంటర్ను పరిశీలించిన కలెక్టర్, గర్భిణులకు అందుతున్న స్కానింగ్ సేవలపై ఆరా తీశారు. స్కానింగ్ కోసం వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, నివేదికలను త్వరగా అందించాలని సూచించారు.
ఆరోగ్యశ్రీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్, పేద ప్రజలకు అందుతున్న ఉచిత వైద్య సేవలు, లబ్ధిదారుల నమోదు ప్రక్రియను పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆరోగ్యశ్రీ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఆపరేషన్ థియేటర్ను పరిశీలించిన కలెక్టర్, పరిశుభ్రత, వైద్య పరికరాల లభ్యత, అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యులతో చర్చించారు. ఆపరేషన్ థియేటర్లో పూర్తి స్థాయి పారిశుధ్య నిర్వహణ ఉండాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధుల్లో అందుబాటులో ఉండాలని కలెక్టర్ సూచించారు. ఆసుపత్రికి వచ్చే పేద రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించి, ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దని స్పష్టం చేశారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ గోపాల్ సింగ్, హెచ్ఓడీ సరోజ, నర్సింగ్ సూపరింటెండెంట్ ధనలక్ష్మి, డ్యూటీ డాక్టర్లు, ఆరోగ్యశ్రీ సిబ్బంది, ఇతర వైద్య నిపుణులు పాల్గొన్నారు.











