కుంటాల, జులై 24
జి డి ఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బైంసా కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు కుంటాల మండలం అంబగావ్ లో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రముఖ ఆర్థో వైద్య నిపుణులు డాక్టర్ వివి హేమంత్ కళ్యాణ్ పాల్గొని రోగులకు వైద్య పరీక్షలు చేసి, 120 మందికి అవసరమైన మందులను ఉచితంగా అందించారు.
జి డి ఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బైంసా కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు కుంటాల మండలం అంబగావ్ లో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ప్రముఖ ఆర్థో వైద్య నిపుణులు డాక్టర్ వివి హేమంత్ కళ్యాణ్ పాల్గొని రోగులకు వైద్య పరీక్షలు చేశారు. అవసరమైన మందులను 120 మంది రోగులకు ఉచితంగా అందించారు.
ఆసుపత్రి పి ఆర్ ఓ కంఠలే రఘువీర్ పటేల్, చంద్రభూషణ్, సిబ్బంది శంకర్, ప్రసాద్ తదితరులు రోగులకు సేవలు అందించారు. వైద్య శిబిరంలో గ్రామ సర్పంచ్ జాధవ్ శివాజీ, డాక్టర్ హేమంత్ కళ్యాణ్ ను అభినందించి సన్మానించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ జాధవ్ శివాజీ మాట్లాడుతూ కృష్ణా మల్టీ స్పెషాలిటీ ఎండి డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్, డాక్టర్ హేమంత్ కళ్యాణ్ తమ గ్రామాన్ని ఎన్నుకొని రోగులకు సేవలు అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో కూడా తమ గ్రామంలో వైద్యులు వైద్య సేవలు అందిస్తే పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.











