సారంగాపూర్ మండలంలో పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు.
గ్రామ సర్పంచ్ వరలక్ష్మీ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని అన్నారు. ఈ సమావేశంలో పర్యావరణ పరిరక్షణకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలపై చర్చ జరిగింది.
మొక్కలు పెంపకం, ప్లాస్టిక్ కవర్లు వాడకాన్ని తగ్గించడం, బట్ట సంచులను ఉపయోగించడం వంటి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
నీటి సంరక్షణ కోసం కొత్త గుంతలు నిర్మించడం, పరిసరాల పరిశుభ్రత, దోమలు నివారణ, వన్యప్రాణుల రక్షణ వంటి అంశాలు కూడా చర్చకు వచ్చాయి.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, ఏఈఓ మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.












