తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకారం, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.
ఇంకా, హన్మకొండ, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, జనగాం, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మంచిర్యాల, మెదక్, నల్గొండ, పెద్దపల్లి, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో, ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేయడం జరిగింది. రాబోయే మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.












