వేసవి సెలవుల్లోనూ విద్యార్థుల్లో పర్యావరణ స్పృహను పెంపొందించే లక్ష్యంతో నిర్మల్ జిల్లా అటవీశాఖ "తగ్గించండి వ్యర్థాలను, పరిరక్షించండి ప్రకృతిని" అనే అంశంపై వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సృజనాత్మకతను ప్రదర్శించారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ పోటీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. సెలవులు కొనసాగుతున్నప్పటికీ, విద్యార్థులు చూపిన ఆసక్తి అభినందనీయమని జిల్లా అటవీ అధికారి సుశాంత్ సుఖ్ దేవ్ బోబడే ఐఎఫ్ఎస్ పేర్కొన్నారు.
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, ప్రకృతిని కాపాడుకోవడం ద్వారా భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని ఆయన అన్నారు. విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని తెలిపారు.
ఈ పోటీలలో విద్యార్థులు పర్యావరణ సమస్యలపై తమ అవగాహనను వ్యాసాలు, చిత్రాల రూపంలో ఆవిష్కరించారు. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను వారు తమ రచనల ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.











