సారంగాపూర్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 03
మండలం ధని గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద నాటిన మొక్కల్లో 50 శాతానికి పైగా ఎండిపోయాయని సోషల్ ఆడిట్లో వెల్లడైంది. ఈ అంశంపై సమగ్ర విచారణ చేపట్టాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ధని గ్రామంలో మొక్కలపై విచారణకు డిమాండ్ ఉపాధి హామీ పథకంలో నాటిన మొక్కల్లో 50 శాతానికి పైగా ఎండిపోయాయని ఆరోపణ , సెప్టెంబరు 3 ( మండలం ధని గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద నాటిన మొక్కల్లో 50 శాతానికి పైగా ఎండిపోయినట్లు సోషల్ ఆడిట్లో వెల్లడైందని గ్రామానికి చెందిన గన్ను లింగారెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని గతంలో నిర్వహించిన గ్రామసభల్లో డీఆర్పీ ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. మొక్కలు నాటే సమయంలో గుంతలు సక్రమంగా తవ్వలేదని, చెట్లు నాటే లోతు తక్కువగా ఉందనే ఆరోపణలు ఫీల్డ్ అసిస్టెంట్‌పై వచ్చాయని తెలిపారు. ఈ వ్యవహారంపై గన్ను లింగారెడ్డి ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎంపీడీవో తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మొక్కల పెంపకంలో జరిగిన నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ చేపట్టాలని లింగారెడ్డి డిమాండ్ చేశారు. ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి బాధ్యులను గుర్తించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఉపాధి హామీ కూలీలకు ఎలాంటి నష్టం కలగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజాధనం వృథా కాకుండా మొక్కల పెంపకం, సంరక్షణ పనులపై అధికారులు పర్యవేక్షణను పెంచాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనపై పారదర్శకంగా విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని గన్ను లింగారెడ్డి డిమాండ్ చేశారు.











