తానూర్, 2026-08-31
నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని బోర్గావ్ బాలాజీ గుట్ట సమీపంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు సోమవారం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ నేపథ్యంలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని బోర్గావ్ బాలాజీ గుట్ట సమీపంలో గత కొన్ని రోజులుగా చిరుతపులి సంచరిస్తున్నట్లు రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు సోమవారం బాలాజీ గుట్ట ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
చిరుత సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో గుట్ట పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు వెళ్లే రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. చిరుత విషయంలో రైతులు భయపడాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు తెలిపారు.
రైతులు ఒంటరిగా గుట్ట పరిసర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. చిరుత సంచారంపై అటవీశాఖ సిబ్బంది నిఘా ఉంచనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా అధికారులు రైతులకు పలు సూచనలు చేసి, ఏదైనా అనుమానాస్పద జంతువు కనిపించినా వెంటనే అటవీశాఖకు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో వికాస్ పాటిల్‌తో పాటు అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.












