విజయనగరం, 27 June
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్ నటించిన 'పెద్ది' చిత్రం విజయంతో పాటు సమాజానికి ఒక ముఖ్యమైన సందేశాన్ని అందించింది. ప్రభుత్వ దృష్టికి నోచుకోని ఒక మారుమూల గ్రామం ప్రజల జీవన విధానం, గుర్తింపు కోసం వారి పోరాటాన్ని ఈ చిత్రం ఆవిష్కరించింది. అప్పలసూరి అనే వ్యక్తి మరణం, విద్య ఆవశ్యకతను, గుర్తింపు లేని బ్రతుకు వృధా అని నొక్కి చెప్పింది.
బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన 'పెద్ది' చిత్రం ఘనవిజయం సాధించింది. మారుమూల పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ కథ, ప్రభుత్వ దృష్టికి నోచుకోని ఒక గ్రామం ప్రజల జీవన విధానాన్ని కళ్ళకు కట్టింది. కూలి పని చేసుకుంటూ, క్రికెట్ ఆటతోనే కాలం గడిపే పెద్దిగాడు, సర్పంచ్ కూతురిని ప్రేమిస్తాడు. ఒకరోజు, హీరోయిన్ తండ్రి ఎన్నికల ప్రచార సభలో ప్రతిపక్షాల అల్లరి మూకలు ఆమె పరువు తీసేందుకు ప్రయత్నించగా, పెద్దిగాడు తన ప్రేయసిని కాపాడి, దుండగులతో ఘర్షణ పడతాడు. ఈ సంఘటనతో ఆగ్రహించిన అల్లరి మూకలు, పెద్దిగాడికి ఇష్టమైన క్రికెట్ ఆటపై మనసు పెట్టకుండా చేస్తారు.
ఈ పరిణామాలను గమనించిన కన్నడ నటుడు శివరాజ్ కుమార్ (గౌరీ నాయుడు) పెద్దిగాడికి కుస్తీ, ఆటో నేర్పించడానికి ముందుకు వస్తాడు. మరోవైపు, సామాజిక బాధ్యత కలిగిన జగపతిబాబు (అప్పలసూరి) కొండకింద ఊరి ప్రజల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాడు. అయితే, ఎమ్మెల్యే వద్ద సమస్యను విన్నవించే క్రమంలో అప్పలసూరి అవమానానికి గురై, ఆత్మహత్యకు పాల్పడతాడు. పెద్దిగాడు, స్నేహితులు అప్పలసూరిని కాపాడే ప్రయత్నంలో ఆయన తలకు గాయమై, మరణిస్తాడు. 'గుర్తింపు లేని బ్రతుకు బ్రతుకు కాదు' అని చివరి మాటగా చెప్పి అప్పలసూరి మరణిస్తాడు. దీంతో ఆగ్రహించిన పెద్దిగాడు, ఊరి ప్రజలతో కలిసి రైల్వే పట్టాలను ధ్వంసం చేస్తాడు. పోలీసులు అందరినీ అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురిచేస్తారు. మృతదేహాన్ని దహన సంస్కారాల కోసం అప్పగించమని వేడుకున్నా, ఆధార్ కార్డు లేదని పోలీసులు నిరాకరిస్తారు.
నిస్సహాయంగా వెళ్ళిపోతున్న సమయంలో, పెద్దిగాడు గౌరీ నాయుడి వద్దకు వెళ్లి కుస్తీలో శిక్షణ పొందుతాడు. జాతీయ స్థాయిలో కొన్ని కారణాల వల్ల ఓడిపోయిన పెద్ది, ఒంటరిగా ఢిల్లీ వెళ్లి, ఊరి ప్రజల కోసం, ఊరికి గుర్తింపు కోసం అధికారులను వేడుకుంటాడు. అయినా ఫలితం దక్కక స్వగ్రామానికి తిరుగు ప్రయాణమవుతాడు. ఢిల్లీలో కృత్రిమ కాళ్లతో పరుగు పందెం ఆడుతున్న వారిని చూసి, తన ఊరికి గుర్తింపు తేవాలనే తపనతో, తన కాలిని కోల్పోయి పరుగు పందెంలో పాల్గొంటాడు. బంగారు పతకాన్ని సాధించి, ఆ పతకాన్ని కానుకగా కాకుండా, తన ఊరికి గుర్తింపు, అప్పలసూరి పేరు మీద రైల్వే స్టేషన్ సాధిస్తాడు. ఇది 'పెద్ది' చిత్రం కథ.
క్రీడారంగంలో అనేక రకాల ఆటలు ఉన్నప్పటికీ, కేవలం ఆట ఆడటమే కాకుండా విద్య కూడా చాలా అవసరమని 'పెద్ది' చిత్రం నొక్కి చెబుతుంది. విద్య లేని ఆట వల్ల గుర్తింపు, ప్రయోజనం శూన్యం. అప్పలసూరి మరణం ప్రతి పౌరుడికి విద్య ఆవశ్యకతను గుర్తు చేస్తుంది. విద్య ఉంటేనే గుర్తింపు, లేదంటే సున్నా అని చిత్రం సందేశం ఇచ్చింది. దర్శకుడు బుచ్చిబాబు ఎంచుకున్న కథ, దానిని మలచిన విధానం, ధైర్యం ప్రశంసనీయం. ఈ చిత్రానికి నిజమైన 'పెద్ది' దర్శకుడే.












