Nirmal/Khanapur (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 12
ఖానాపూర్: పాఠశాల విద్య, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యు.ఎస్.పి.సి) ఆధ్వర్యంలో బుధవారం ఖానాపూర్ తహశీల్దార్ సుజాత గారి కి వినతిపత్రం సమర్పించారు. సమస్యల పరిష్కారం కోసం దశలవారీ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని నాయ గారి కిలు తెలిపారు.
పాఠశాల విద్య మరియు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యు.ఎస్.పి.సి) ఆధ్వర్యంలో బుధవారం ఖానాపూర్ తహశీల్దార్ సుజాత గారి కి వినతిపత్రం (మెమోరాండం) సమర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పాఠశాలలు మరియు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం దశలవారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా నేడు తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టి వినతిపత్రం అందించడం జరిగిందన్నారు.
పి.ఆర్.సి నివేదికను వెంటనే తెప్పించుకుని, 01.07.2023 నుండి అమలు చేయాలి. ఉపాధ్యాయులు, పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న 6 విడతల డి.ఎ.లను వెంటనే విడుదల చేయాలి. సి.పి.ఎస్. రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (ఓ.పి.సి.) పునరుద్ధరించాలి. పాఠశాలల మూసివేత ఆలోచనను విరమించుకోవాలి. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ను తక్షణమే విడుదల చేయాలి. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి, పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి.
సమస్యలు పరిష్కారం కాని పక్షంలో ఈ నెల 19న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, ఆగస్టు 29న రాష్ట్ర రాజధానిలో వేలాది మంది ఉపాధ్యాయులతో భారీ నిరసన ప్రదర్శనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాదవ్ వెంకటరావు, జిల్లా అధ్యక్షులు రాజేష్ నాయక్, ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్, టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శులు పరాంకుశం మురళీధర్, ఫాజిల్, అంజయ్య మరియు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.












