హైదరాబాద్, August 15
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు ఆగస్టు 15 నాటికి కొత్త యూనిఫామ్‌లు, కిట్లు అందనున్నాయి. దాదాపు 27 లక్షల మంది విద్యార్థులకు ఈ సౌకర్యం కల్పించనుంది ప్రభుత్వం.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల విద్యార్థులకు ఆగస్టు 15 నాటికి కొత్త యూనిఫామ్‌లను అందించాలని విద్యాశాఖ యోచిస్తోంది. మొత్తం 27 లక్షల మంది విద్యార్థులకు రెండు జతల చొప్పున యూనిఫామ్‌లను సిద్ధం చేస్తున్నారు.
ఈ యూనిఫామ్లతో పాటు బూట్లు, సాక్సులు, బెల్టుతో కూడిన కిట్లను కూడా విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు. గురుకులాల విద్యార్థులకు అదనంగా స్కూల్ బ్యాగ్, బెడ్డింగ్ సామగ్రి, ప్లేట్, గ్లాస్, ట్రంక్ బాక్స్, ట్రాక్ నైట్ డ్రెస్‌లను కూడా అందించనున్నారు.
ఇంటర్మీడియట్ విద్యార్థులకు తొలిసారిగా బ్యాగ్, బెల్ట్, షూ, సాక్సులతో కూడిన ప్రత్యేక కిట్లను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.











