పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన. -బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.
సారంగాపూర్ జులై 04 మనోరంజని తెలుగు టైమ్స్
నిర్మల్ జిల్లా, సారంగాపూర్ :మండలంలోని జాం గ్రామంలోగల కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం లో రూ.38 లక్షలతో అదనపు మౌలిక సదుపాయాల నిర్మాణ పనులకు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థినులకు మెరుగైన విద్యా వాతావరణం, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ, పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి మరింత కృషి చేస్తామని వెల్లడించారు . ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కరిపే రవలీ విలాస్,పాఠశాల ఎస్.ఓ అన్నపూర్ణ, ఎ.ఈ ఆంజనేయులు,మండల బీజేపీ అధ్యక్షులు కాల్వ నరేష్,నాయకులు పోతన్న,తిరుమలచారి రాజేశ్వర్,రాజేందర్,నారాయణ నాయక్, శ్రీ కాంత్ రెడ్డి,అంబాజీ నాయక్, సంబంధిత అధికారులు, నాయకులు, కార్యకర్తలు, పాఠశాల సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.











