आంధ్రప్రదేశ్, 2026-07-20
రాష్ట్ర ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకం లబ్ధిదారుల కోసం దేవదాయ శాఖ నుంచి రూ.26.03 కోట్లు విడుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. బ్రాహ్మణ కార్పొరేషన్ పరిధిలోని లబ్ధిదారులకు ఈ నిధులను చెల్లించనున్నారు. ఈ నెల 22 నుంచి పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు జమ చేయనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ‘తల్లికి వందనం’ పథకం లబ్ధిదారులకు చెల్లించేందుకు దేవదాయ శాఖ నుంచి రూ.26.03 కోట్లు విడుదల చేసేందుకు పరిపాలన అనుమతులిస్తూ ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
బ్రాహ్మణ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే ‘తల్లికి వందనం’ లబ్ధిదారులకు డబ్బులు చెల్లించేందుకు ఈ నిధులను విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందుకు సంబంధించి పీడీ అకౌంట్లో నిధులు జమ చేసేందుకు దేవదాయ శాఖ కమిషనర్ తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.
కాగా, ఈ నెల 22 నుంచి ‘తల్లికి వందనం’ పథకం కింద ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు జమ చేయనున్న విషయం తెలిసిందే.












