ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమహేంద్రవరంలో గ్లోబల్ విశ్వవిద్యాలయంలో ఎస్టీయూ 80వ వసంతాల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ఎస్టీయూ జిల్లా శాఖ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల సంఘం ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు సాగిన ప్రస్థానం, విద్యారంగ అభివృద్ధిలో సంఘం పాత్ర, ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణకు చేపట్టిన కార్యక్రమాలపై చర్చ జరిగింది.
నాయకులు భవిష్యత్ కార్యాచరణపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సమ్మేళనంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాంపల్లి నాగభూషణ్, రాష్ట్ర కార్యదర్శి ఏ. బాజా రెడ్డి, జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి జె. లక్ష్మణ్, జిల్లా ఆర్థిక కార్యదర్శి బి. వెంకటేశ్వర్ రావు మరియు నిర్మల్ జిల్లా బాధ్యుడు రాజ్ మహేందర్ పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల సంక్షేమం, విద్యా ప్రమాణాల పెంపు, సంఘ బలోపేతం వంటి అంశాలపై చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు.










