మాక్లూర్, జూన్ 27
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసిన రచ్చ మురళికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా హాజరైన నిజామాబాద్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు, రచ్చ మురళిని అభినందించారు. ఆయన విద్యార్థులకు అక్షర జ్ఞానాన్ని అందించి, ఉన్నత శిఖరాలకు చేర్చిన ఆదర్శ ఉపాధ్యాయుడని కొనియాడారు.
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహించిన రచ్చ మురళి పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు విశిష్ట అతిథిగా హాజరై మాట్లాడారు.
ప్రభుత్వ విధి నిర్వహణలో భాగంగా విద్యార్థులకు అక్షర జ్ఞానాన్ని అందించి, వారిని ఉన్నత శిఖరాలకు చేరుకునేలా తీర్చిదిద్దిన ఆదర్శ ఉపాధ్యాయుడు రచ్చ మురళి అని కొనియాడారు. విద్యాబోధనతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన భాగస్వామ్యం కావడం అభినందనీయమన్నారు.
తన చిన్ననాటి విద్యాభ్యాసం ఇదే పాఠశాలలో కొనసాగిందని, ఆ రోజుల జ్ఞాపకాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న సమయంలో పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందించినట్లు తెలిపారు.
పాఠశాల భవన నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఇద్దరు ఎమ్మెల్యేల సహకారంతో సుమారు రూ.6 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తన తాత, తండ్రి జ్ఞాపకార్థం రూ.కోటి విరాళం అందజేశారని పేర్కొన్నారు. గ్రామస్తులు కూడా ఐక్యంగా ముందుకు వచ్చి సుమారు రూ.2 కోట్ల మేర సహకారం అందించారని తెలిపారు.
హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటడం, పాఠశాల అభివృద్ధికి కృషి చేయడం వంటి కార్యక్రమాల్లో రచ్చ మురళి చురుకుగా పాల్గొన్నారని కొనియాడారు. పదవీ విరమణ అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.












