Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 01
మామడ మండలంలోని పొన్కల్ బీసీ హాస్టల్‌ను తహసీల్దార్ శ్రీనివాస్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లో విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను పరిశీలించి, నాణ్యమైన ఆహారం అందించాలని సిబ్బందికి సూచించారు.
మామడ మండలంలోని పొన్కల్ బీసీ హాస్టల్‌ను తహసీల్దార్ శ్రీనివాస్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లో విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను పరిశీలించారు.
ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన, పోషకాహారంతో కూడిన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని హాస్టల్ సిబ్బందికి సూచించారు. హాస్టల్లో ప్రస్తుతం ఎంతమంది విద్యార్థులు ఉన్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అలాగే విద్యార్థులకు అందుతున్న వసతులు, పరిశుభ్రత, ఇతర సౌకర్యాలపై ఆరా తీసి, ఎలాంటి లోపాలు లేకుండా హాస్టల్‌ను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.











