నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అనసూయ పవార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ వెల్లడించారు.
ఈ నెల 22న శుక్రవారం సాయంత్రం 4 గంటలకు భైంసాలోని ఎస్.ఎస్. జిన్నింగ్ ఫ్యాక్టరీలో ఈ సన్మాన కార్యక్రమం జరగనుంది.
ప్రతి పాఠశాల నుంచి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. అలాగే, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కూడా హాజరు కావాలని కోరారు.
విద్యార్థులలో విద్యా స్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.










