కడం (పెద్దూర్), 2026-06-05
కడం మండల కేంద్రంలోని నచ్చన్ ఎల్లాపూర్ గ్రామంలో ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థుల ప్రయాణ సౌకర్యం కోసం చేసిన పోరాటం ఫలించింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. ఈ పాఠశాల విద్యార్థుల ప్రయోజనార్థం శాశ్వత ఎక్స్ప్రెస్ బస్ స్టాప్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

రవాణా సమస్యపై నిరంతర కృషి
సామాజిక సేవకులు . రాజేశ్ కుమార్ ఛత్రపతి గారు గత కొంతకాలంగా ఈ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు, దూర ప్రాంతాల నుంచి వస్తున్న తల్లిదండ్రులు, అలాగే పాఠశాల సిబ్బంది ఎదుర్కొంటున్న రవాణా సమస్యను గుర్తించి నిరంతరం కృషి చేశారు. పలుమార్లు సంబంధిత అధికారులను కలిసి, బస్సు సౌకర్యం అవసరాన్ని వివరించడంతో మొదట రిక్వెస్ట్ బస్ స్టాప్ మంజూరైంది.
తాత్కాలిక బస్ స్టాప్ తో ఇబ్బందులు
అయితే, రిక్వెస్ట్ బస్ స్టాప్ మంజూరైనప్పటికీ, కొంతమంది డ్రైవర్లు, కండక్టర్లు బస్సును అక్కడ ఆపేందుకు నిరాకరించడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడటమే కాకుండా పలుమార్లు వాగ్వాదాలు కూడా చోటుచేసుకున్నాయి. ఈ సమస్య తీవ్రతను గుర్తించిన . రాజేశ్ కుమార్ ఛత్రపతి, సమస్యకు తాత్కాలిక పరిష్కారం కాకుండా శాశ్వత పరిష్కారమే కావాలని భావించారు.
అధికారుల చొరవతో శాశ్వత పరిష్కారం
వెంటనే కరీంనగర్ ఎక్సిక్యూటీవ్ డైరెక్టర్ సార్ నిర్మల్ జిల్లా పండరి సార్ గారిని కలిసి పరిస్థితిని వివరించి, విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది ప్రయోజనార్థం శాశ్వత ఎక్స్ప్రెస్ బస్ స్టాప్ ఏర్పాటు చేయాలని వినమ్రంగా విన్నవించారు. వారి విజ్ఞప్తికి స్పందించిన నిర్మల్ జిల్లా పండరి సార్ గారు, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం నిజంగా అభినందనీయం.
సేవా స్ఫూర్తికి ప్రశంసలు
ఒక సమస్యను చూసి స్పందించడం వేరు, ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే వరకు పోరాడటం వేరు. . రాజేశ్ కుమార్ ఛత్రపతి గారు రెండో మార్గాన్ని ఎంచుకొని, విద్యార్థుల సౌకర్యం కోసం కృషి చేశారు. ఈ నిర్ణయంతో పాఠశాల ప్రిన్సిపాల్ . శకుంతల మేడం గారు, విద్యార్థినులు, తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
అభినందనలు, ధన్యవాదాలు