డాక్టర్ పూసపాటి నరేష్ కి సన్మానించిన ఎమ్మెల్యే బిఎల్ఆర్
మిర్యాలగూడ ఆగస్టు 6 (మనోరంజని తెలుగు టైమ్స్)
మిర్యాలగూడ మండలం ఆలగడప గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూ డాక్టరేట్ పట్టా పొందిన పూసపాటి నరేష్ పీహెచ్డీ (డాక్టరేట్) పొందగా గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నరేష్ కుశాలువాలతో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) ఘనంగాసన్మానించారు. ఇటీవల నరేష్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ (పీహెచ్డీ) పట్టా అందుకోవడం మిర్యాలగూడ నియోజకవర్గానికి గర్వకారణం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలగడప ఇంద్ర పల్లి శ్రీనివాస్ ఉపసర్పంచి అక్బర్ బాషా, గ్రామ శాఖ అధ్యక్షుడు నల్లగొండ రామన్న, ఉపాధ్యక్షుడు పూసపాటి నాగయ్య, ఇంద్రపల్లి బుచ్చిబాబు, కొత్త నరసయ్య, చేన్నబోయిన రమేష్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్త వెంకట్ వెంకటాద్రిపాలెం సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.












