మర్కల్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 02
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం మర్కల్ గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఇండియన్ ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ అయిన ఆచార్య ప్రఫుల్ల చంద్ర రాయ్ జన్మదినోత్సవం పురస్కరించుకొని జాతీయ రసాయన శాస్త్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

నివాళులర్పించిన ప్రిన్సిపల్
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి. శోభారాణి, ఆచార్య ప్రఫుల్ల చంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సేవలందించిన తీరు వివరణ
రసాయన శాస్త్ర విభాగాధిపతి మీనా, ప్రఫుల్ల చంద్ర రసాయన శాస్త్రానికి అందించిన సేవలను గురించి విద్యార్థులకు వివరించారు.
విద్యార్థుల ఉపన్యాసాలు
విద్యార్థులు కూడా రసాయన శాస్త్ర గొప్పదనం గురించి ఉపన్యాసాలు ఇచ్చారు.
ప్రతిభావంతులకు బహుమతులు
కెమిస్ట్రీ పరీక్షలో ఉన్నత ప్రతిభ కనపరిచిన వారికి బహుమతులు అందజేశారు.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎస్. కృష్ణవేణి, రసాయన శాస్త్ర అధ్యాపకురాలు ఝాన్సీ, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.