మల్లాపూర్, 2026-06-05
ైఈకార్యక్రమంలోమల్లాపూర్సర్పంచ్ మేడిపల్లి సునీత గంగాధర్ మరియుఉపాధ్యాయులుగ్రామస్తులుపాల్గొన్నారు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మరియుఉడుతస్వప్నభీమేష్,మునిపెల్లిసర్పంచ్
లక్ష్మణ చందా మండలంలోని మల్లాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు చార్టర్డ్ అకౌంటెంట్ నికేష్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రోత్సాహాన్ని అందించే ఉద్దేశ్యంతో ఈ బహుమతి ప్రదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా, పదవ తరగతి పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను నికేష్ రెడ్డి అభినందించారు. మొదటి బహుమతి సాధించిన జుంజూరు రిషి వర్ధన్ కు 12,000 రూపాయల నగదు బహుమతిని అందజేశారు. అదేవిధంగా, రెండో బహుమతి పొందిన భ్యుల రాణికి 8,000 రూపాయల నగదును బహుమతిగా అందించారు. ఈ నగదు బహుమతులు విద్యార్థుల భవిష్యత్ విద్యాభ్యాసానికి ఉపయోగపడతాయని నికేష్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మల్లాపూర్ సర్పంచ్ ఉడుత స్వప్న భీమేష్,మునిపెల్లి సర్పంచ్ మేడిపల్లి సునీత గంగాధర్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మరియు ఉపాధ్యాయులు గ్రామస్తులు పాల్గొన్నారు












