చేపూర్–ఆర్మూర్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 10
చేపూర్ఆర్మూర్లోని క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రతిబింబించేలా బోనాల వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని వేడుకలను వైభవంగా జరుపుకున్నారు.
చేపూర్ఆర్మూర్లోని క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రతిబింబించేలా బోనాల వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ అల్జాపూర్ దేవాందర్, కోశాధికారి అల్జాపూర్ గంగాధర్, ప్రిన్సిపాల్ డాక్టర్ కట్కం శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్, కళాశాల ఏఓ బి. నరేందర్, సోషల్ మీడియా ఇన్చార్జ్ శృతిన్, అన్ని విభాగాల అధిపతులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు హాజరయ్యారు.
బోనాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక
కార్యక్రమ నిర్వాహకులు స్వాగత ప్రసంగంలో బోనాల పండుగ విశిష్టతను, తెలంగాణ సంస్కృతిలో దాని ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ బోనాల పండుగ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, సంస్కృతిసంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. తరతరాలుగా కొనసాగుతున్న బోనాల సంప్రదాయం భక్తి, విశ్వాసం, ఐక్యతకు ప్రతిరూపమని పేర్కొన్నారు. విద్యార్థులు ఆధునిక విద్య, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభ్యసించడంతో పాటు తమ ప్రాంతీయ సంస్కృతి, సంప్రదాయాలు, జానపద కళలను గౌరవించి, వాటి గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు అందించాలని సూచించారు. విద్యార్థుల విద్యా అభివృద్ధితో పాటు సాంస్కృతిక, సామాజిక విలువలను పెంపొందించేందుకు కళాశాల ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. బోనాల పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సమృద్ధి నెలకొనాలని, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించి కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
సంప్రదాయబద్ధంగా బోనం ఊరేగింపు
కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రాంగణంలో బోనం ఊరేగింపును సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. విద్యార్థినులు సంప్రదాయ దుస్తుల్లో బోనాలను తలపై ధరించి భక్తిశ్రద్ధలతో ఊరేగింపులో పాల్గొన్నారు. తెలంగాణ జానపద సంగీతం, నృత్యాలతో కళాశాల ప్రాంగణం సందడిగా మారింది. అనంతరం శ్రీ మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ప్రార్థించి విద్యార్థులు, కళాశాల అభివృద్ధితో పాటు అందరి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాల కోసం అమ్మవారి ఆశీస్సులు కోరారు.
విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కట్కం శ్రీనివాస్ మాట్లాడుతూ బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. విద్యార్థులు ఆధునిక విద్యతో పాటు తమ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలని సూచించారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధితో పాటు సాంస్కృతిక విలువలకు కూడా కళాశాల ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ముఖ్య అతిథి అల్జాపూర్ చైతన్య, డిప్యూటీ డైరెక్టర్ (టారిఫ్ ఇంజినీరింగ్), తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, హైదరాబాద్ మాట్లాడుతూ కళాశాలలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు చదువుతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలు, జానపద కళలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. బోనాల వంటి పండుగలు సమాజంలో ఐక్యత, భక్తి, సాంస్కృతిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. అనంతరం నిర్వహించిన పోతురాజు ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పోతురాజు నృత్యంతో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందిలో ఉత్సాహం వెల్లివిరిసింది. విద్యార్థులు తెలంగాణ జానపద గీతాలు, సంప్రదాయ నృత్యాలు, తెలంగాణ సంస్కృతిసంప్రదాయాలను ప్రతిబింబించే నాటికలను ప్రదర్శించారు. వారి సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలంగాణ పల్లె జీవన విధానం, సంప్రదాయాలు, జానపద కళల వైభవాన్ని విద్యార్థులు తమ ప్రదర్శనల ద్వారా చాటిచెప్పారు.


