మిర్యాలగూడ, జులై 17
తెలంగాణలో పెండింగ్ లో ఉన్న బీసీ విద్యార్థుల ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయకపోతే ఉద్యమిస్తామని బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ హెచ్చరించారు. మిర్యాలగూడలో జరిగిన విద్యార్థుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం 8 వేల కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేయకపోవడంతో 14 లక్షల మంది విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణలో పెండింగ్ లో ఉన్న బీసీ విద్యార్థుల ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయకపోతే ఉద్యమిస్తామని బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ తెలిపారు. శుక్రవారం మిర్యాలగూడలో విద్యార్థుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీసీ విద్యార్థులను ప్రభుత్వం చిత్రహింసలకు గురి చేస్తోందని, దాదాపు 8 వేల కోట్ల రూపాయల ఫీజు బకాయిలు పెండింగ్ లో ఉండటం వలన 14 లక్షల మంది విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారని అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను, ఫీజు రీయింబర్స్మెంట్ ను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు.
కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉన్నత చదువులకు వెళ్లేందుకు కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదని తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో విడుదల అయితే ఎంతోమంది పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలు చదువుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని అశోక్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్క నాగేశ్వరరావు, బీసీ యువజన సంఘం జిల్లా కన్వీనర్ సిద్ధం రాజు, బీసీ యువజన సంఘం నియోజకవర్గ నాయకులు మునగల శైలేందర్, బీసీ యువజన సంఘం పట్టణ కార్యదర్శి పట్టేటి రమేష్, బీసీ యువజన సంఘం పట్టణ నాయకులు ఉపేందర్, రమేష్, రాజు, శంకర్, నీలిమ, ఉమా, కీర్తి తదితరులు పాల్గొన్నారు.











