హైదరాబాద్, 2026-08-10
ప్రముఖ కవి, రచయిత, సాహిత్య విమర్శకుడు, అనువాదకుడు, బహుభాషా కోవిదుడు, భారత సైన్యంలో జూనియర్ కమిషన్డ్ అధికారి డా. పెరుక రాజు గారికి సాహిత్యం, అనువాదం, నైతిక విలువల పరిరక్షణ, మానవతా సేవా రంగాల్లో విశిష్ట సేవలకు గాను మరో అరుదైన గౌరవం లభించింది. అంతర్జాతీయ నైతిక విలువల అకాడమీ ఆయనకు జీవితకాల సభ్యత్వాన్ని ప్రదానం చేసింది.

గౌరవ డాక్టరేట్ ప్రదానం
అదేవిధంగా, సంగీతం మరియు కళల విశ్వవిద్యాలయం ఎబిఆర్ ఆధ్వర్యంలో ఫరీదాబాద్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సాహిత్యం, అనువాద రంగాల్లో ఆయన చేసిన విశిష్ట కృషికి గుర్తింపుగా గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ప్రముఖ పౌరులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
విద్యా నేపథ్యం, సాహిత్య కృషి
ఆంగ్ల సాహిత్యంలో స్నాతకోత్తర పట్టాతో పాటు పీహెచ్డీ, మూడు గౌరవ డాక్టరేట్లను పొందిన డా. పెరుక రాజు వివిధ భాషల్లో 15 గ్రంథాలను రచించారు. కవిత్వం, కథాసాహిత్యం, సాహిత్య విమర్శ, అనువాద రంగాల్లో ఆయన విశేష సేవలందిస్తున్నారు. దేశభక్తి, మానవీయ విలువలు, సామాజిక న్యాయం, జాతీయ సమైక్యత ఆయన రచనల్లో ప్రధానంగా ప్రతిధ్వనిస్తాయి.
సామాజిక సేవ
మై గిఫ్ట్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడిగా విద్య, సేవ, మానవతా కార్యక్రమాల ద్వారా సమాజానికి సేవలందిస్తూ, ప్రోత్సాహమే గొప్ప బహుమతి అనే సందేశంతో ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
బహుముఖ సేవలు
సైనికుడిగా, సాహితీవేత్తగా, అనువాదకుడిగా, మానవతావాదిగా డా. పెరుక రాజు అందిస్తున్న బహుముఖ సేవలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి.