నిర్మల్, జూలై 9
జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా గురువారం జిల్లా కేంద్రంలోని విజయ హైస్కూల్లో నిర్వహిస్తున్న ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ఆకస్మికంగా సందర్శించారు. పరిశీలనకే పరిమితం కాకుండా, స్వయంగా తరగతి నిర్వహించి ఉపాధ్యాయులకు బోధనా విధానాలపై మార్గనిర్దేశం చేశారు.
జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా విద్యా రంగానికి తనకున్న ప్రత్యేక శ్రద్ధను మరోసారి చాటిచెప్పారు. గురువారం జిల్లా కేంద్రంలోని విజయ హైస్కూల్లో నిర్వహిస్తున్న ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ఆకస్మికంగా సందర్శించిన ఆయన, పరిశీలనకే పరిమితం కాకుండా స్వయంగా తరగతి నిర్వహించి ఉపాధ్యాయులకు బోధనా విధానాలపై మార్గనిర్దేశం చేశారు.
స్మార్ట్ బోర్డు వినియోగంతో పాఠ్యాంశాలను ప్రభావవంతంగా బోధించే పద్ధతులను వివరిస్తూ, విద్యార్థుల్లో అవగాహన పెంపొందించే విద్యార్థి కేంద్రిత బోధనపై పలు సూచనలు చేశారు. క్లిష్టమైన అంశాలను సరళంగా వివరించడం, విద్యార్థులను ఆలోచింపజేసే ప్రశ్నలు అడగడం, ప్రతి విద్యార్థి తరగతి గదిలో చురుకుగా పాల్గొనేలా బోధన సాగించాలని సూచించారు.
శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్, బోధనలో ఎదురవుతున్న సవాళ్లపై వారి అభిప్రాయాలను తెలుసుకుని, వాటికి అనుసరించాల్సిన సమర్థవంతమైన విధానాలను వివరించారు. ఉపాధ్యాయుల సందేహాలకు సమాధానాలు ఇస్తూ, నాణ్యమైన విద్య అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.











