భైంసా, జూలై 4
భైంసా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 36 ఏళ్లుగా అధ్యాపకుడిగా సేవలందించిన భూషణ్ పాండే సేవలు చిరస్మరణీయమని వశిష్ట జూనియర్ కళాశాల డైరెక్టర్ వి. సత్యనారాయణ గౌడ్ అన్నారు. శనివారం భైంసా పట్టణంలోని వశిష్ట జూనియర్ కళాశాలలో ఆయన పదవీ విరమణ సందర్భంగా ఘనంగా సన్మానించారు.
భైంసా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 36 సంవత్సరాల పాటు అధ్యాపకుడిగా సేవలందిస్తూ ఎందరో విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చిన భూషణ్ పాండే సేవలు చిరస్మరణీయమని వశిష్ట జూనియర్ కళాశాల డైరెక్టర్ వి. సత్యనారాయణ గౌడ్ అన్నారు. శనివారం భైంసా పట్టణంలోని వశిష్ట జూనియర్ కళాశాల ప్రాంగణంలో పదవీ విరమణ సందర్భంగా భూషణ్ పాండేను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ, భూషణ్ పాండే క్రమశిక్షణ, సత్ప్రవర్తనతో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించారని కొనియాడారు. తన సుదీర్ఘ సేవాకాలంలో ఎందరో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది ఉన్నత శిఖరాలను అధిరోహించేలా కృషి చేశారని పేర్కొన్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విధులు నిర్వర్తించినప్పటికీ వశిష్ట జూనియర్ కళాశాల అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకారం అందించారని, ఆయనతో తమకు, కళాశాలకు విడదీయరాని అనుబంధం ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎల్. నారాయణరెడ్డి, న్యాయవాది, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవి పాండే, కళాశాల ప్రిన్సిపల్ వెంకటేష్, నాయకులు గాలి రవి, ప్రభాకర్, సాయినాథ్, కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.












