భైంసా, జూలై 21
భైంసా పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాల ఆచార్యురాలు అతిమముల అపర్ణ అనారోగ్యంతో మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
భైంసా పట్టణంలోని గుజిరిగల్లీలో గల శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాల ఆచార్యురాలు అతిమముల అపర్ణ (ఉపాధ్యాయురాలు) అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆమె భౌతికకాయాన్ని భైంసాలోని గుజిరిగల్లీలో ఉన్న స్వగృహానికి తీసుకురాగా, బుధవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
అపర్ణ అకాల మరణం పట్ల పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, స్థానికులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించారు.












