భద్రాచలం, 2026-06-05
భద్రాచలం మండల విద్యాశాఖాధికారిగా బెక్కంటి శ్రీనివాసరావు సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. జిల్లా విద్యాశాఖ అధికారి సూచనల మేరకు ఆయన ఈ బాధ్యతలను చేపట్టారు.
భద్రాచలం మండల విద్యాశాఖాధికారిగా బెక్కంటి శ్రీనివాసరావు సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. జిల్లా విద్యాశాఖ అధికారి సూచనల మేరకు భద్రాచలం మండల విద్యా వనరుల కేంద్రంలో ఆయన నూతన బాధ్యతలను చేపట్టారు. గతంలో ఈ పదవిలో పనిచేసిన టి రమా నుండి ఆయన అధికారికంగా బాధ్యతలను స్వీకరించారు.
ఘనంగా సన్మానం
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రిటైర్డ్ గజిటెడ్ హెడ్మాస్టర్ లక్ష్మీనారాయణ, స్థానిక ఐటిసి పేపర్ బోర్డ్ కాంట్రాక్టర్ పాకాల దుర్గాప్రసాద్, జగదీష్ కాలనీ ప్రధానోపాధ్యాయులు రాజా శ్రీనివాస్, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు బెక్కంటి శ్రీనివాసరావుకు పూల గుచ్చాలతో స్వాగతం పలికి, శాలువాలతో ఘనంగా సన్మానించారు.











