కుంటాల మండలంలోని ఆదర్శ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో తమ ప్రతిభను చాటుకున్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో అత్యుత్తమ ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేశారు.
విడుదలైన ఫలితాల ప్రకారం, ప్రథమ సంవత్సరంలో 121 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 113 మంది ఉత్తీర్ణులై 93 శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 129 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 118 మంది ఉత్తీర్ణులై 91 శాతం ఫలితాలు నమోదయ్యాయి.
ప్రథమ సంవత్సరంలో జోగిరి మనిషా (సీఈసీ) 500కు 475 మార్కులతో రాష్ట్ర స్థాయిలో టాపర్గా నిలిచి కళాశాలకు కీర్తి తెచ్చింది. గనోబా గంగోత్రి (ఎంఈసీ) 469 మార్కులు, కండెల భావన (ఎంపీసీ) 455 మార్కులు, సూర్యవంశీ ఆకాంక్ష (బైపీసీ) 429 మార్కులతో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.
ద్వితీయ సంవత్సరంలో పుల్లోలు గనుశ్రీ (ఎంపీసీ) 1000కు 990 మార్కులతో రాష్ట్ర స్థాయిలో టాపర్గా నిలవడం విశేషం. కోరిపల్లి వినతి, వెంకట్వాడ్ స్వప్న (బైపీసీ) ఇద్దరూ 1000కు 985 మార్కులతో ప్రతిభ చూపగా, సల్లావాడు వైష్ణవి (సీఈసీ) 939 మార్కులు, గడ్పాలే శృతి థాయ్ (ఎంఈసీ) 873 మార్కులతో మెరుగైన ఫలితాలు సాధించారు.
కళాశాల ప్రిన్సిపాల్ ఏత్రాజ్ రాజు విద్యార్థుల విజయాన్ని అభినందిస్తూ, ఇది విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే సాధ్యమైందని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.












