వేల్పూర్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 09
సనాతన ధర్మంలో గోమాత అత్యంత పవిత్రమైనదని, గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారని వేల్పూర్ గోవింద సాయి దివ్య యోగాశ్రమం కమిటీ ప్రతినిధులు తెలిపారు. గురువారం ఆశ్రమంలో గోమాతను అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించారు. అనంతరం పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. గోపూజతో ప్రాంగణమంతా భజనలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

గోపూజ చేయడం వల్ల సకల తీర్థాలను దర్శించిన ఫలితం లభిస్తుందని, గ్రహదోషాలు, పితృ దోషాలు తొలగిపోతాయని కమిటీ ప్రతినిధులు విశ్వాసం వ్యక్తం చేశారు. గోమాతకు నమస్కరించి ప్రదక్షిణలు చేశారు. గోవులకు పండ్లు, బెల్లం, పచ్చగడ్డిని భక్తితో తినిపించారు.
ఈ కార్యక్రమంలో సాయిరాం బాల్రాజ్, కూశన్నగారి నర్సయ్య, నోముల గంగారెడ్డి, అబ్బోగోని జగదీశ్వర్ గౌడ్, కాపర్తి రమేష్ గుప్తా, గడ్డం మల్లేష్, కోరెం నర్సాగౌడ్, కొండ అశోక్ గౌడ్, దమ్మాయి లక్ష్మి, కుంట సువర్ణ, మెండె మహేందర్, సీతారాం పల్లె, అంక్సాపూర్ గ్రామాలకు చెందిన సాయి సేవకులు, గోవింద సాయి దివ్య యోగాశ్రమ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.