నిజామాబాద్, జూలై 29
గురు పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ నగరంలో గురుపూజోత్సవాన్ని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. నగరంలోని వివిధ ఆలయాలు, ఆశ్రమాల్లో ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు.
గురు పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ నగరంలో గురుపూజోత్సవాన్ని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయాలు, ఆశ్రమాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.
ఈ సందర్భంగా బ్రహ్మపురి ప్రాంతంలోని పెద్ద రామాలయంలో శ్రీశ్రీశ్రీ సమర్థ రాందాస్ మహారాజ్ పాదుకలకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిపూర్వకంగా పూజలు నిర్వహించారు.
అలాగే వినాయక్ నగర్లోని శ్రీ శివకేశవనాథ ఆశ్రమంలో శ్రీ విశ్వగురు దత్తపీఠం వ్యవస్థాపకులు శ్రీశ్రీశ్రీ శివకేశవనాథ స్వామివారికి పాదపూజను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ పాదపూజ కార్యక్రమంలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదం పొందారు.
ఈ కార్యక్రమాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తిశ్రద్ధల మధ్య కొనసాగినట్లు కార్యక్రమ నిర్వహణ అధికారి గుప్త లింగన్న తెలిపారు. గురుపౌర్ణమి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.












