నగరి పట్టణంలో TTD ఆధ్వర్యంలో శ్రీ కరియ మాణిక్య స్వామి వారి కంచి గరుడ సేవ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని స్థానిక ఆలయ అభివృద్ధి కమిటీ, భక్త బృందం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు ఆలయ అధికారి వెంకటరమణకు విన్నవించుకున్నారు.
ప్రతి సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారుల పర్యవేక్షణలో ఈ ఉత్సవం చక్కగా నిర్వహించబడుతోంది. ఈనెల 30వ తేదీన జరిగే కంచి గరుడ ఉత్సవాన్ని బ్రహ్మాండంగా జరిపించాలని స్థానిక భక్త బృందం కోరింది. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తుల సహకారం పూర్తిస్థాయిలో ఉంటుందని వారు తెలిపారు.
వివిధ కళాకారులు, వాయిద్య బృందాలు, కోలాటాలు, బాణీ డాన్స్, దేవతామూర్తుల వేషధారణతో కూడిన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని విన్నవించారు. స్వామివారికి ప్రత్యేక పుష్పాలంకరణ, విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేయాలని, ప్రసాద వినియోగం కూడా పూర్తిస్థాయిలో నిర్వహించాలని సూచించారు.
ఈ విన్నపాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆలయ అభివృద్ధి కమిటీ తరపున సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు కేశవాచార్యులు, ధన్వంత ఆచార్యులు, వేద పారాయణ పండితులు రాంప్రసాద్ గారు, ఆలయ సిబ్బంది, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.












