నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండలంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, చికిత్స పొందుతూ మరణించిన గజ్జ శ్రీధర్ (37) కేసులో, అతనికి ఆత్మహత్యాయత్నానికి కారణమైన దేశెట్టి గంగయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆలూరు గ్రామానికి చెందిన గజ్జ శ్రీధర్, పొలం కోయడానికి హార్వెస్టర్లు రాకుండా అడ్డుకున్నారని మనస్థాపానికి గురై ఏప్రిల్ 29న నిర్మల్లోని కలెక్టరేట్ వద్ద పురుగుల మందు సేవించారు.
ఆ సమయంలోనే అతన్ని వెంటనే నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతిచెందారు.
మృతుడి భార్య ప్రేమల ఫిర్యాదు మేరకు, శ్రీధర్ మృతికి కారణమైన దేశెట్టి గంగయ్యపై కేసు నమోదు చేసుకుని, అతన్ని అరెస్ట్ చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ వెల్లడించారు.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.








