బీచుపల్లి (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 30
నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్.ఏ. సంపత్ కుమార్ లు బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు వారికి ఘన స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి అలంపూర్ నియోజకవర్గం పరిధిలోని ఎర్రవల్లి మండలంలో గల ప్రముఖ పుణ్యక్షేత్రం బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవితో పాటు అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్.ఏ. సంపత్ కుమార్ లకు ఆలయ కార్యనిర్వహణ అధికారి సురేందర్, వేద పండితులు, అర్చకులు పూర్ణకలశంతో స్వాగతం పలికారు.
ఆలయ మర్యాదలు
అనంతరం ఆలయ మర్యాదలతో ఎంపీ మల్లు రవి, డాక్టర్ సంపత్ కుమార్ లను సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఎంపీ మల్లు రవి నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘన స్వాగతం పలికారు.
పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు తిరుపతయ్య, గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాస్, అలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప, వైస్ చైర్మన్ కుమార్, ఎర్రవల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు వెంకటేష్ తో పాటు పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












