మిర్యాలగూడ, 2026-08-30
పవిత్ర శ్రావణ మాస బోనాలు ఆదివారం మిర్యాలగూడలో ఘనంగా కొనసాగాయి. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ 6వ వార్డులో కొలువుదీరిన యల్లమ్మ, మైసమ్మ తల్లులకు కాలనీ వాసులు శాస్త్రోక్తంగా సామూహిక బోనాలు సమర్పించుకున్నారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
పవిత్ర శ్రావణ మాస బోనాలు ఆదివారం మిర్యాలగూడలో ఘనంగా కొనసాగాయి. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ 6వ వార్డులో కొలువుదీరిన యల్లమ్మ, మైసమ్మ తల్లులకు కాలనీ వాసులు ఆదివారం శాస్త్రోక్తంగా పెద్ద సంఖ్యలో హాజరై సామూహిక బోనాలు సమర్పించుకున్నారు.
శ్రావణ బోనాల వేడుకలకు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బోనాలు ప్రతీకగా నిలుస్తాయని, భక్తి శ్రద్ధల నడుమ వేడుకలు జరిపి భవిష్యత్ తరాలకు సంప్రదాయాన్ని అందించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా పెద్ద ఎత్తున హాజరైన కాలనీ వాసులు గ్రామ దేవతలకు మేక పోతులు, కోళ్లు బలి ఇచ్చి తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్ కుమార్, సీనియర్ నాయకులు నూకల వేణుగోపాల్ రెడ్డి, ముదిరెడ్డి నర్సిరెడ్డి, కౌన్సిలర్లు ఆడోతు అశోక్ నాయక్, నూకల కవిత, ఆలయ కమిటీ సభ్యులు పసుపులేటి రాము, నక్క పాపయ్య ముదిరాజ్, జంగా లక్ష్మణ్ యాదవ్, అంబటి వెంకటకృష్ణ, పతాని కృష్ణతో పాటు ఉపేందర్ చారి, హనుమాన్ చారి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా, అమ్మవార్లకు పట్టు వస్త్రాలను మిర్యాలగూడ కో-ఆపరేటివ్ మేనేజర్ కందుకూరి అలివేలు బహుకరించారు. మరోవైపు, రమేష్ అమ్మవార్లకు గంటలను బహుకరించారు.












