లోకేశ్వరం, 25 July
లోకేశ్వరం మండలంలో తొలి ఏకాదశి పండుగను భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో వైభవంగా జరుపుకున్నారు. పండుగ సందర్భంగా ఉదయం నుంచే స్థానిక ఆలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. ఆలయాలకు చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ తొలి ఏకాదశి ప్రాముఖ్యతను వివరించారు. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులలో ఇది మొదటిదని, ఈ రోజు నుంచే శ్రీమహావిష్ణువు నాలుగు నెలల పాటు యోగనిద్రలోకి వెళ్తుండటంతో దీనిని 'శయన ఏకాదశి' అని కూడా పిలుస్తారని తెలిపారు. తొలి ఏకాదశి రోజున ఉపవాసాలు ఉంటూ, విష్ణుసహస్రనామ పారాయణం చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధించి, సమస్త పాపాలు తొలగిపోతాయని పేర్కొన్నారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.