హైదరాబాద్, జూలై 20
నగరంలోని పోచారం ప్రాంతంలో నిర్వహించిన శ్రీ జగన్నాథ రథయాత్రను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు రాజేష్ ముదిరెడ్డి సోమవారం శాస్త్రోక్త పూజల మధ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని జగన్నాథ స్వామిని ప్రార్థించారు.
నగరంలోని పోచారం ప్రాంతంలో నిర్వహించిన శ్రీ జగన్నాథ రథయాత్రను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు రాజేష్ ముదిరెడ్డి సోమవారం శాస్త్రోక్త పూజల మధ్య ప్రారంభించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి ఆయన రథయాత్రకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా రాజేష్ ముదిరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులకు సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడాలని, ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని జగన్నాథ స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ దూరదర్శిని వ్యాఖ్యాత శశి, కాంగ్రెస్ నాయకులు బద్దం వెంకటరెడ్డి, మెట్టు బాల్రెడ్డి, నివాస సంక్షేమ సంఘం అధ్యక్షుడు పీలా సత్యనారాయణ, కార్యదర్శి ఇందిరా ప్రియదర్శిని, యునస్ ఖాన్, రామకృష్ణ, అభిలాష్ కజ్జం తదితరులు పాల్గొన్నారు.











