నిర్మల్, జూలై 25
గోదావరి పుష్కరాలు–2027 సందర్భంగా భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై రాష్ట్ర పోలీసు శాఖ శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమీక్షలో పుష్కర ఘాట్ల వద్ద వాచ్ టవర్లు, సీసీటీవీ నిఘా, కమాండ్ కంట్రోల్ సెంటర్ల ఏర్పాటుకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
గోదావరి పుష్కరాలు–2027 సందర్భంగా భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై రాష్ట్ర పోలీసు శాఖ శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించింది. డీజీపీ కార్యాలయం నుంచి ఏడీజీపీ (లా అండ్ ఆర్డర్) మహేష్ మురళీధర్ భగవత్, ఐపీఎస్ రాష్ట్రంలోని పుష్కర జిల్లాల పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ పాల్గొన్నారు.
పుష్కర ఘాట్ల వద్ద వాచ్ టవర్లు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు, సీసీటీవీ నిఘా వ్యవస్థలు, డ్రోన్ సర్వైలెన్స్, ట్రాఫిక్ నిర్వహణ, అత్యవసర స్పందన బృందాల ఏర్పాటును ముందుగానే పూర్తి చేయాలని ఏడీజీపీ ఆదేశించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.
అలాగే నిర్మల్ జిల్లాలోని బాసర, సోన్, సావర్గాం ప్రాంతాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో భైంసా అదనపు ఎస్పీ సాయి కిరణ్, ఐపీఎస్, ఇన్స్పెక్టర్లు ప్రవీణ్, కృష్ణ, సత్యనారాయణ, దీపక్, రవీందర్, ఆర్ఐ రామ్నిరంజన్, సబ్ ఇన్స్పెక్టర్లు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.











