బోథ్ మండలంలోని మహారాష్ట్ర సరిహద్దులో గల శ్రీ శిఖర్ కైలాస్ టెక్డి ఆలయంలో మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించి, ఏకబిల్వం, మహాబిల్వం, పత్రి మొక్కలను ప్రతిష్టించారు.
శ్రీ లింబాజి మహారాజ్ సూచన మేరకు, తుల శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్లోని కడియం నుండి తీసుకువచ్చిన పవిత్ర మొక్కలను ఆలయ ప్రాంగణంలో నాటారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, మహాబిల్వ దళాలను శివునికి సమర్పించడం అత్యంత పుణ్యప్రదమని, త్రిమూర్తుల అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయని వివరించారు. మారేడు దళాలు త్రిగుణాలకు ప్రతీక అని, శివార్చనకు అవి శ్రేష్ఠమని పేర్కొన్నారు.
మహాబిల్వం, ఏకబిల్వం మొక్కలను ఆలయంలో ప్రతిష్టించడం ద్వారా భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందని భావిస్తున్నారు. ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది.












