నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని కిసాన్ గల్లీలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో తోట్ల పోచమ్మ–మహాలక్ష్మి అమ్మవారి బోనాల పండుగను ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలని, సకాలంలో వర్షాలు కురిసి రైతులు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ గల్లి అధ్యక్షుడు దీపోల్ల సాయినాథ్, ఉపాధ్యక్షుడు కారగిరి గంగభూషణ్, ప్రధాన కార్యదర్శి అల్లకొండ సతీష్, కాసరి రామకృష్ణ, సంఘ సభ్యులు, రైతు సోదరులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.











