బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 25
తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భైంసా పట్టణంలో వేడుకలు ఘనంగా జరిగాయి. పురాణ బజార్లోని మార్వాడి భవన్ నుండి ప్రారంభమైన విఠలేశ్వరుని పల్లకి యాత్ర ప్రధాన వీధుల గుండా సాగింది. ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ ఈ యాత్రలో పాల్గొని, వార్కరి సాంప్రదాయం గొప్పతనాన్ని కొనియాడారు.
తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భైంసా పట్టణంలో వేడుకలు ఘనంగా జరిగాయి. పురాణ బజార్లోని మార్వాడి భవన్ నుండి ప్రారంభమైన విఠలేశ్వరుని పల్లకి యాత్ర ప్రధాన వీధుల గుండా కొనసాగింది.
ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ శోభాయాత్రను ప్రారంభించి, పూర్తయ్యే వరకు భజన బృందాలతో కలిసి యాత్రలో పాల్గొన్నారు. చిన్నారులు విఠల్ రుక్మిణి, భక్త తుకారం వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ మాట్లాడుతూ వార్కరి సాంప్రదాయం ప్రపంచంలోనే చాలా గొప్పదని, ఆధ్యాత్మిక మార్గంతో ఐక్యతా భావం పెంపొందడంతో పాటు సన్మార్గం వైపు పయనించగలుగుతామని అన్నారు.
శోభాయాత్రలో భక్తులకు ప్రతి ఇంటిలో స్వాగతం పలికారు. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విఠలరుక్మిణి నామస్మరణతో ఆ ప్రాంతం మారుమోగింది.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమొల్ల దత్తాత్రి, కౌన్సిలర్లు, ప్రముఖులు పాల్గొన్నారు.












