సారాంశం
ఈ నెల 29న వ్యాస పూర్ణిమ (గురుపౌర్ణిమ) సందర్భంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఉత్సవాలకు ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్‌ను శుక్రవారం భైంసాలో ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వాహణ అధికారి (ఈఓ) అంజలి దేవి తో ఎమ్మెల్యే ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
ముఖ్య విషయాలు
- 1బాసర గురుపౌర్ణిమ ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆలయ అధికారుల ఆహ్వానం
ఈ నెల 29న వ్యాస పూర్ణిమ (గురుపౌర్ణిమ) సందర్భంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఉత్సవాలకు ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్‌ను శుక్రవారం భైంసాలో ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.
- 2ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వాహణ అధికారి (ఈఓ) అంజలి దేవి తో ఎమ్మెల్యే ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
- 3ఉత్సవాలకు వచ్చే భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, వేద పండితుల సన్మాన కార్యక్రమం, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు.
- 4ప్రస్తుతం కొనసాగుతున్న బాసర ఆలయ పునర్నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు.
ఈ నెల 29న వ్యాస పూర్ణిమ (గురుపౌర్ణిమ) సందర్భంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఉత్సవాలకు ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్‌ను శుక్రవారం భైంసాలో ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వాహణ అధికారి (ఈఓ) అంజలి దేవి తో ఎమ్మెల్యే ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
ఉత్సవాలకు వచ్చే భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, వేద పండితుల సన్మాన కార్యక్రమం, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు. ప్రస్తుతం కొనసాగుతున్న బాసర ఆలయ పునర్నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. ఆలయ అభివృద్ధి పనులు నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
ఆహ్వాన కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు ఆశీర్వచనాలు అందించి, అమ్మవారి తీర్థ ప్రసాదాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ అంజలి దేవి, స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్, ఆలయ పూజారులు, నాయకులు సతీష్ రెడ్డి, గంగారెడ్డి, పృథ్వీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.