ఆలంపూర్, 2026-06-05
జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అలంపూర్ శ్రీ బాల బ్రహ్మేశ్వరజోగులాంబ అమ్మవారి దేవాలయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన కేంద్ర మంత్రికి ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్.ఏ.సంపత్ కుమార్ శాలువా కప్పి సాదరంగా స్వాగతం పలికారు.
జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అలంపూర్ శ్రీ బాల బ్రహ్మేశ్వరజోగులాంబ అమ్మవారి దేవాలయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన కేంద్ర మంత్రికి ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్.ఏ.సంపత్ కుమార్ శాలువా కప్పి సాదరంగా స్వాగతం పలికారు.
తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో రూ.4.30 కోట్ల వ్యయంతో జోగులాంబ అమ్మవారి ఆలయ సన్నిధిలో ఏర్పాటు చేసిన లేజర్ షోను ఈ సందర్భంగా ప్రారంభించారు. లేజర్ షో ద్వారా జోగులాంబ అమ్మవారి ఆలయ చరిత్ర, క్షేత్ర ప్రాశస్త్యం, ఆధ్యాత్మిక విశిష్టతను భక్తులకు దృశ్యరూపంలో పరిచయం చేసేలా కార్యక్రమాన్ని రూపొందించారు.
ఈ కార్యక్రమానికి నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో డాక్టర్ ఎస్.ఏ. సంపత్ కుమార్తో పాటు మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, ఆలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప, వైస్ చైర్మన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేస్తాం.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ, రాజకీయ పార్టీలు వేరైనా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో అందరితో కలిసి పనిచేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ముందుకు సాగుతామని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు మల్లు రవి, డీకే అరుణ, డాక్టర్.ఎస్.ఏ.సంపత్ కుమార్ తదితరులు లేజర్ షోను వీక్షించారు. ఆలయ చరిత్రను ఆకట్టుకునే రీతిలో ప్రదర్శించే ఈ లేజర్ షోతో జోగులాంబ అమ్మవారి క్షేత్ర ప్రాశస్త్యం మరింత మంది భక్తులకు చేరువ అవుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
లేజర్ షో ద్వారా జోగులాంబ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరగడంతో పాటు తెలంగాణ టూరిజం శాఖకు, ఆలయానికి ఆదాయం సమకూరే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. అలంపూర్ క్షేత్రాన్ని మరింత ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, వివిధ శాఖల అధికారులు, పోలీసు అధికారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, అన్ని మండలాల మండల అధ్యక్షులు, సర్పంచులు, పట్టణ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.












